ఆర్మూర్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్ ఆర్థిక సహకారంతో మునిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో తండ్రి లేని కూతురి వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు విద్య ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రిని కోల్పోయి అయోమయ పరిస్థితిలో ఉన్న కుటుంబానికి రోటరీ క్లబ్ తోడు నీడలా ఉంటుందని, పేద కుటుంబాలు అధైర్య పడవద్దని తెలిపారు.
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సహకారంలో ముందువరుసలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రెటరీ శంకర్, సభ్యులు గోనే శ్రీధర్, ఖాందేశ్ గంగాధర్, భార్గవి, గంగుల వేణు, సత్యం తదితరులు పాల్గొన్నారు.