కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం సిద్ధంగా ఉంటుందని, రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత శ్రావణ్‌ను అభినందించారు.
కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు చందన్ పాల్గొన్నారు.