వేల్పూర్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు గ్రామ పంచాయితీలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను, గ్రామ సభ ముందుంచారు. అలాగే చేపట్టబోయే పనుల ప్రణాళిక వివరించారు. గ్రామ పంచాయితీ ఆదాయ వ్యయాలు ప్రజలకు వివరించారు.
గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధి లాంటివని అన్నారు. గ్రామ సభల వల్ల ప్రభుత్వం అందించే నిధులు ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయి అనేది ప్రజలకు కూడా తెలియ చేయడం జరుగుతుందన్నారు. రాబోయేది వాన కాలం కాబట్టి అంటు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు వివరించారు.
గ్రామ సభకు ప్రజలు, యువకులు, గ్రామ స్థాయి అధికారులు, వార్డ్ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధ మోహన్, సెక్రెటరీ వినోద్ కుమార్, వార్డ్ సభ్యులు దేవేందర్, బీమా ప్రసాద్, ఆశ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్ వాడి టీచర్‌లు పాల్గొన్నారు.