ఆర్మూర్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని యువజన సమాజ్ అధ్యక్షులు ప్రశాంత్ తెలిపారు. క్షత్రియ పేద వృద్ధ మహిళలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, ప్రతినెల క్షత్రియ పేద కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గుజరాతి విద్యా సాగర్, సాయి కుమార్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.