నిజామాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీ ఏఎన్‌ఎంలను కోవిడ్ విధుల నుండి వెంటనే రిలీవ్ చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కోవిడ్ కేసులు ఉదృతంగా పెరిగాయని, ఏప్రిల్ 26 నుండి కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని కేజీబీవీ ఏ.ఎన్.ఎం లు వివిధ పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహకం అందకున్నా, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు.
జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టినాయన్నారు. అదే సమయంలో జులై 1 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ ఏ.ఎన్.ఎం లను కోవిడ్ విధుల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్‌ని కోరామన్నారు. కేజీబీవీ ఏ.ఎన్.ఎం లు అరుణ, అనుపమ, అనసూయ పాల్గొన్నారు.