డిచ్పల్లి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్ఎస్ఎస్ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు యోగా ఎట్ హోమ్ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఏర్పాటు చేసిన సమావేశంలో యోగా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్త, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీమ్ పాల్గొన్నారు.
యోగా ప్రాముఖ్యతను, కోవిడ్‌ను ఎదుర్కొవాల్సిన చిట్కాలను యోగా గురువు వినోద్ వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రొఫెసర్, తదితరులు పాల్గొన్నారు.