కామారెడ్డి, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల పేరుతో, పుస్తకాలు కొనుగోలు చేయాలని, ట్యూషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చొరవ చూపి కార్పొరేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక జీవో తీసుకువచ్చి నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నాయకులు నరేంధర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని పాఠశాలలు, కళాశాలలు పదవ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం అయిపోయిన విద్యార్థులకు టిసి, ఇతర పత్రాలు ఇవ్వడానికి గత సంవత్సరం మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నాయని, కరోనా మహమ్మరిని దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా అన్ని పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.