జక్రాన్‌పల్లి, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అర్గుల్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, గ్రామంలో అన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
శాంతిభద్రతలు కాపాడటానికి సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, వీటిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజల ఆస్తులను కాపాడుటకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ డిసిపి అరవింద్‌బాబు, ఏసిపి వెంకటేశ్వర్, డిచ్‌పల్లి సిఐ రఘునాథ్, జక్రాన్‌పల్లి ఎస్‌ఐ సాయిరెడ్డి, కళాబృందం సిబ్బంది పాల్గొన్నారు.