వేల్పూర్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని సమస్యలు ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.
గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో అన్ని వాడల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు సహకరించాలన్నారు.
అదేవిధంగా గ్రామంలో సిసి కెమెరాలు సైతం ఏర్పాటు చేసే విధంగా గ్రామాభివృద్ధి కమిటీతో చర్చలు జరిపి త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉప సర్పంచ్ ముత్యం, పాలకవర్గం సభ్యులు, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.