మోర్తాడ్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలం లోని ధర్మోర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి జక్క లింగం తన 20 మంది అనుచరులతో మోర్తాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు.
కార్యక్రమంలో మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్, ఎన్డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్న, ధర్మోర గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పబ్బ బాజన్న తదితరులు పాల్గొన్నారు.