నిజామాబాద్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖలీల్ వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం, అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యాక్సినేషన్ విధానాన్ని నిర్వహకులని అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ మహమ్మారి నుండి బయట పడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమ్మని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. స్వయంగా తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని, వ్యాక్సినేషన్ గురించి ప్రజలకి అవగాహన కల్పించాలని అధికారులని ఆదేశించారు.
కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.