నవీపేట్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాలోకి వేళ్తే నాళేశ్వర్ గ్రామానికి చెందిన సాయిరాం అనే యువకుడు కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను తరుచు వేధిస్తుండడంతో విసుగుచెందిన బాలిక తన తల్లితండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి యువకుడినికి మందలించారు.
పంచాయతి పెట్టారన్న పగతో రెచ్చిపోయిన యువకుడు బాలిక తండ్రి అయిన పోశెట్టి, సోదరుడు శ్రీకాంత్‌పై అతిదారుణంగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దాడిలో బాలిక చిన్ననాన్న నడిపి పోశెట్టి పరిస్థితి విషమంగా ఉండడడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.