వేల్పూర్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ తా అనే నినాదం అందరిని ఏక తాటి పైకి తీసుకురావడానికి చేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నగారి మోహన్, సీనియర్ నాయకులు పొన్నాల రాజేశ్వర్, భాష గంగాధర్, బద్దం రాజారెడ్డి, నోముల నర్సారెడ్డి, వినోద్, యాదగిరి కార్తీక్, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.