కామారెడ్డి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోచారం గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్దురాలికి కాలువిరిగి ఆపరేషన్ నిమిత్తమై 0 పాజిటివ్ 4 యూనిట్ల రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన 57 ఏళ్ల వయసు గల వృద్ధుడు సిద్ధిరాములు, పట్టణానికి చెందిన హిందూ వాహిని ప్రతినిధి కంకణాల రాజు, గన్నేరి మహేష్ రక్తదానం చేశారు.
కార్యక్రమంలో రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్, కొత్మిర్ కార్ రామకృష్ణ, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.