వేల్పూర్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నాగదర్ ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ సురేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.