కామారెడ్డి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్ధానిక సంస్థల, ప్రయివేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కె. జి.బి.వి, మాడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని రకాల హాస్టళ్లలో పనిచేసే అందరు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 24వ తేదీ గురువారం నుండి ఆయా మండలాల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు టీకా తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.రాజు తెలిపారు.
వాక్సినేషన్ కొరకు వెళ్లే ఉద్యోగులు తమవెంట ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకువెళ్లాలని, ఈనెల 25 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి ఒక్క సిబ్బంది సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.