నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 60ని కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్-టీచింగ్, వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 60 విడుదల చేసిందన్నారు. జీ.వో 60 ప్రకారం 1,2,3 కేటగిరీలకు వరుసగా రూ.15 వేల 600, రూ. 19 వేల 500, రూ.22 వేల 750 చొప్పున వేతనాలు పెంచారన్నారు. జీవో నెం 60 ని కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
జీవో ప్రకారం కేజీబీవీల్లో పనిచేస్తున్న వంటమనిషి, స్వీపర్, అటెండర్, వాచ్ వుమెన్, స్కావెంజర్ లకు నెలకు రూ. 15 వేల 600, కంప్యూటర్, ఒకేషనల్ ట్రైనర్‌లకు రూ. 19 వేల 500, అకౌంటెంట్, ఏ.ఎన్.ఎం లకు రూ. 22 వేల 750 చొప్పున వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు.
జీ.వో నెం.60 ప్రకారం వేతనాలు పెంచి జూలై వేతనంతో కలిపి ఇవ్వాలన్నారు. 2016 లో విడుదలైన జీవో నెం 14 కేజీబీవీల్లో ఇప్పటికీ అమలుకాక ఏళ్లుగా శ్రమదోపిడికీ గురయ్యారని, జీవో నెం 60ని వీరికి వర్తింపజేసి, ఇప్పటికైనా కనీస న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
కార్యక్రమంలో వివిధ కేజీబీవీల నాన్ టీచింగ్, వర్కర్లు సుజాత, హేమలత, సుమలత, పద్మ, ఉమ, కరుణశ్రీ, పుష్పలత, శారద, నిర్మల, లత, లక్ష్మీ, జీవిత, విజయ, గోదావరమ్మ, మరోని, తదితరులు పాల్గొన్నారు.