నందిపేట్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి ఇంటి వద్ద స్వయం ఖర్చులతో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న అభయాంజనేయ స్వామి పిరమిడ్ ధ్యాన మందిరంను బుధవారం గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిణుగు రణవీర్ సందర్శించి పనులను పరిశీలంచారు.
ధ్యాన మందిరం 18, 18 సైజుతో నిర్మాణం చేయడం జరిగిందని ఇట్టి ధ్యాన మందిరంలో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా 6, 6 సైజుతో కింగ్ చాంబర్ ను ఏర్పాటు చేశామని, సాయికృష్ణ రెడ్డి లోక కళ్యాణార్థం ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరుగుతుందని రణవీర్ పేర్కొన్నారు. ధ్యాన మందిరంలో ప్రజలు తమ సమయానుకూలంగా విచ్చేసి ధ్యానం చేసుకోవచ్చని తెలిపారు.
ధ్యాన మందిరంని ఎంతో అద్భుతంగా , కళాత్మకంగా నిర్మించడం జరిగిందని పనులు చకచకా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ ఇట్టి ధ్యానం మందిరంలో ధ్యానం చేసి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో మానసిక ప్రశాంతతతో జీవించాలని తెలిపారు.
ఇంత చక్కని జ్ఞాన మందిరాన్ని లోకకల్యాణార్థం కొరకు నిర్మించడం చాలా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా సాయి కృష్ణ రెడ్డిని ప్రత్యేకంగా ఉప సర్పంచ్ చందర్ అభినందించారు.
కార్యక్రమంలో తొండకూర్ మాజీ సర్పంచ్ దశ గౌడ్, మురళి, ఉపసర్పంచ్ రామ్ చందర్, చిలుక సుభాష్ మాస్టర్, పోలిశెట్టి, ధ్యాన బంధువులు పాల్గొన్నారు.