కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నూతన కలెక్టరేట్ సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, లీడ్ బ్యాంక్, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి శాఖ, జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.