బోధన్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర సరకుల ధరలు సామాన్యులకు అందకుండ ఆకాశానికి ఎగబాకడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా పెట్రోల్ బంకు వద్ద వామమపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్,సీపీఐ పార్టీ బోధన్ నియోజక వర్గ నాయకులు ఎస్‌కే బాబు, సీపీఐ (ఎం) పార్టీ బోధన్ పట్టణ కార్యదర్శి జే.శంకర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడడంలో విఫలమైన పాలకులు ప్రెట్రొల్, డిజీల్ ధరలను పెంచుతూ వాటితో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని మండి పడ్డారు.
దేశంలో ప్రజల ఓట్లతో గెలుపొందిన పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను, భూములను బడా కార్పోరేట్ సంస్థలకు, అంబాని, ఆదానీలకు అమ్మివేస్తున్నారని, పాలకుల ప్రైవేటీకరణ విదానాలను వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు యిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సుల్తాన్ సాయులు, ఏఐకేఏంఎస్ నాయకులు గంగయ్య, రమేశ్, కృష్ణ, శంకర్, పీవోడబ్ల్యూ నాయకులు బి.నాగమణి, పాషా బేగం, రెహనా బేగం, సీపీఎం నాయకులు గంగాదరప్ప, ఎశాల గంగాధర్, సీ.పీ ఐ నాయకులు పాల్గొన్నారు.