వేల్పూర్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని రామన్న పేట్ గ్రామంలో అటవీ స్థలాన్ని ఎంపీపీ జమున, సర్పంచ్ వీణ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు రామన్నపేట్ గ్రామ శివారులో గల అటవీ స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు.
వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వాడ వాడలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో అశోక్ కార్యదర్శి శివకుమార్ ఉపసర్పంచ్ నవీన్ ఎం పి టి సి సభ్యులు ఉపాధిహామీ మెట్ వనిత ప్రజలు పాల్గొన్నారు