Daily Archives: June 26, 2021

27న అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్‌ ఎంపవర్‌ మెంట్‌’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్‌ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం కానున్న …

Read More »

పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌ టీయూ – టీఎస్‌ నాయకులు శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్‌ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా …

Read More »

రోడ్లపై ట్రాక్టర్‌ కేజ్‌వీల్స్‌ నడిపితే చర్యలు

భీమ్‌గల్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం గొన్‌ గొప్పుల గ్రామంలో భీంగల్‌ ఎస్‌ఐ పి.ప్రభాకర్‌ ట్రాక్టర్‌ యూనియన్‌ వారితో, గ్రామస్తులతో సమావేశమయ్యారు. రోడ్లపై ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌ పట్టీలతో లేని వాటిని నడపవద్దని, అందరూ ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌లకు పట్టీలు వేయించుకోవాలని సూచించారు. ఎవరైనా పట్టీలు లేని ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌ లను రోడ్‌లపై నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read More »

జూలై 6 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు జూలై 6 నుంచి 15 వ‌ర‌కు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్‌ …

Read More »

బోధన్‌లో వామపక్ష పార్టీల నాయకుల అరెస్టు

బోధన్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …

Read More »

ఆదివారం నుండి ఆన్‌లైన్‌ తరగతులు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ‌ సెమిస్టర్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుల ఆన్‌లైన్‌ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ ద్వారా లాగిన్‌ అయి జూమ్‌ యాప్‌ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

రక్తదానం చేసిన అధ్యాపకుడు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రజిత గర్భిణీకి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్‌ బ్యాంకులో ఎస్‌.ఆర్‌.కె కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు మురళి 15వ సారి రక్తదానం …

Read More »

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

వేల్పూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం వేల్పుర్‌ మండలంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను భీమ్‌గల్‌ ఎడిఎ మల్లయ్య, వేల్పూర్‌ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకి కల్తీ విత్తనాలు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీలర్‌ కూడా …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

వేల్పూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలోని మండల టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్‌కి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »