వేల్పూర్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్‌కి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చులు అందుకోవాలంటే ఒక పెద్ద పైరవి అని పైరవి కారులకు మాత్రమే సమైక్య రాష్ట్రంలో న్యాయం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు చేరుతున్నాయన్నారు.
నాటి రోజుల్లో నిరుపేదలు హాస్పిటల్లో వారి ఆరోగ్యాల నిమిత్తం లక్షలు ఖర్చు చేసుకునే వారని వాటిని మళ్ళీ తిరిగి ఎక్కడ దరఖాస్తు చేయాలి, ఎవరిని అడగాలి అనేది కూడా అయోమయంగా ఉండేది అన్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ లబ్ది జరుగుతుందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసిన ఘనత మంత్రి ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
లబ్ధిదారుల తరఫున, వేల్పూరు గ్రామ ప్రజల తరఫున మంత్రి ప్రశాంత్ రెడ్డికి, సీఎం కేసీఆర్‌కి దన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బుర్ ప్రతాప్, కుర్మా గంగాధర్, మొండి దీపక్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నరేష్, గంగాధర్ గౌడ్, గౌరయి జీవన్, నల్లవెళ్లి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, ఇమ్రాన్, మేదిద పల్లి బాల కిషన్, గంగారెడ్డి, చాకలి దేవేందర్ పాల్గొన్నారు.