నిజామాబాద్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్ ఆప్షనల్ సబ్జెక్టుల ఆన్‌లైన్ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి జూమ్ యాప్ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు సమయానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తరగతులకు హాజరు కావాలన్నారు. తరగతులకు హాజరు కానివారు యూ ట్యూబ్ చానల్ ద్వారా కూడా వినవచ్చని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ తరగతులు జూన్ 27, జూలై 1, జూలై 4, జూలై 7, జూలై 10, జూలై 11 తేదీలలో నిర్వహించబడతాయన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.