వేల్పూర్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం వేల్పుర్ మండలంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను భీమ్గల్ ఎడిఎ మల్లయ్య, వేల్పూర్ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకి కల్తీ విత్తనాలు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీలర్ కూడా గుర్తింపు పొందిన కంపెనీ వారి నుండి మాత్రమే ఉత్పత్తులను తీసుకోని రైతులకు అమ్మాలని సూచించారు. కార్యక్రమంలో వేల్పూర్ మండలం వ్యవసాయ అధికారి నరసయ్య పాల్గొన్నారు.