కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రజిత గర్భిణీకి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్ బ్యాంకులో ఎస్.ఆర్.కె కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు మురళి 15వ సారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన అధ్యాపకుడు మురళిని కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలు అభినందించారు.