కామారెడ్డి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గుప్తా, బాలు మాట్లాడారు.
వాసాలమర్రి గ్రామంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులను సావుకారి గాడు అని, ఐదు రూపాయల వడ్డీ తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు వైశ్యుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్యవైశ్యులందరికీ క్షమాపణలు చెప్పాలని కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య నాయకులు డిమాండ్ చేశారు.
సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్యుల పట్ల కేసీఆర్ వాడిన పదజాలం ఆయన యొక్క అవివేకానికి నిదర్శనమని, వ్యాఖ్యలను టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ఆర్య వైశ్యులు, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా పదవులు పొందిన నాయకులు ఖండిరచకపోవడం సిగ్గుచేటన్నారు.
గతంలో కెసిఆర్ కోటి రూపాయలు ఇచ్చినా కోమటోల్లను కొనుక్కోవాలి అని మాట్లాడిన, నేడు ఈ రకంగా మాట్లాడడం కెసిఆర్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని రానున్న రోజుల్లో ఆర్యవైశ్యుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారని ఆర్య వైశ్యులు అంతా కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిరచాలని పార్టీలను, జెండాలను పక్కన పెట్టి ఐక్యంగా నిలబడి ఆర్యవైశ్యుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు గోలి శ్రీనివాస్ గుప్త, వలిపిశెట్టి భాస్కర్ గుప్త, గౌరిశెట్టి గుణింధర్ గుప్తా, బోనగిరి శివ కుమార్ గుప్తా పాల్గొన్నారు.