నందిపేట్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామానికి చెందిన అరుగుల సాయి కుమార్ కుమారుడు రిషిక్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చులు చేసినప్పటికి జబ్బు నయం కాకపోవడతో మెరుగైన వైద్యం కొరకు తన వ్యవసాయ భూమిని అమ్మేశారు. అయినా డబ్బు సరిపోవడం లేదని చేసేదేమీలేక హైదరాబాద్ ఆసుపత్రి నుండి నిజామాబాద్ ఆసుపత్రికి ఆదివారం తిరిగి వచ్చారు.
విషయం తెలుసుకున్న నందిపేట్ ఎంపిపి అతని స్నేహితులు పెద్ద మనసు చేసుకొని ఆపన్న హస్తం అందించారు. వన్నెల్ గ్రామానికి చెందిన ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, వన్నెల సర్పంచ్ కృష్టా రెడ్డి, కుద్వాన్పుర్ సొసైటీ చైర్మన్ కార్తీక్ రెడ్డి ఒకొక్కరుగా 11 వేల రూపాయల చొప్పున 33 వేల ఆర్థిక సహాయం చేశారు.
అదే విధంగా ఎంఎల్‌ఏ , పియూసి చైర్మన్ జీవన్ రెడ్డితో మాట్లాడి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని బాలుని కుటుంబానికి భరోసా ఇచ్చి కుటుంభ సభ్యలకు మనో ధైర్యాన్ని కల్పించారు. మరికొందరు దాతలు ముందుకు వచ్చి తమ బాలుని ఆరోగ్యానికి ఆర్థిక సహాయం అందించాలని సాయికుమార్ విజ్ఞప్తి చేసాడు.