నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం రాత్రి ఏ.ఐ. సీ.సీ తెలంగాణకు నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించడంతో ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నియమించబడ్డ నాయకులందరికీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి నూతన శకం ప్రారంభంకానుందని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లాంటి నాయకుని అవసరం పార్టీకి ఉందని, కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ ఉన్న నాయకుడు దూకుడుగా వ్యవహరించే నాయకుడు, ముక్కు సూటిగా మాట్లాడుతూ నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే రేవంత్ రెడ్డి లాంటి నాయకుని సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో నూతన సమరోత్సాహం నిండిరదన్నారు.
అలాగే ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మధుయాష్కి గౌడ్ని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రచార కమిటీ బాధ్యతలను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెండు పర్యాయాలు నిజామాబాద్ ఎం.పిగా, ఏ.ఐ.సీ.సీ కార్యదర్శిగ పనిచేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేసిన మధు యాష్కీ గౌడ్ని నియమించడం అలాగే విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై విద్యార్థి సంఘంలో చురుకుగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్.ఎస్. యూ.ఐ కి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి, నిన్నటి దాకా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్షిగా వ్యవహరించిన నిజామాబాద్ జిల్లా కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షునిగా నియమించడం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు.
అనంతరం నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నియమింబడ్డ నాయకులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే 2023 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీ.సీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్కీ యాదవ్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు వరధబట్టు వేణురాజ్, పీ.సీ.సీ కార్యదర్శులు మజీద్ ఖాన్, నగేశ్ రెడ్డి, పీ.సీ.సీ సభ్యులు ఈసా, ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఈజాజ్ భాయ్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు రాజ నరేందర్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ బ్లాక్ ప్రెసిడెంట్ అబ్బు, మహిళా కాంగ్రెస్ నాయకులు విజయలక్ష్మి, ఉష, అయేషా బీ, డీ.సీ.సీ కార్యదర్శులు నర్సింగరావు, అనిల్ రావు, నగర కాంగ్రెస్ నాయకులు ప్రమోద్, సర్దార్ నరేందర్ సింగ్, శుభమ్, ముష్షు, కయ్యుం, ఎం.ఏ హలీమ్, జకీర్ హుస్సన్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.