వేల్పూర్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారికి తగిన గౌరవం అందిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం దీనికి నిదర్శనమని వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లాకు రెండు పదవులను ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి మిఠాయి పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వడం శుభ పరిణామమని, పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రచార కమిటీ చీఫ్‌గా నియమించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నీరడి భాగ్య, దామోదర్ గౌడ్, రమణ, ప్రవీణ్ చంద్ర గౌడ్, మహేందర్, రంగు అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.