డిచ్‌పల్లి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహం ఎదురుగా సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ 61 వ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు.
కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య డి. రవీందర్, సతీమణి సౌభాగ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్, ప్రొ. యాదగిరి, ప్రొ. కకనకయ్య, ప్రొ. అత్తర్ సుల్తానా, ప్రొ. అరుణ, ప్రొ. విద్యావర్దిని, డా. పాత నాగరాజు, డా. త్రివేణి, డా. శాంతాబాయి తదితర సిబ్బంది గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఫీస్ ఫుల్ లిల్లీ పాంట్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ పరిశోధకుల అవార్డ్ ఫోటో గల మెమెంటో, గజమాల, కేక్, స్వీట్స్ బహూకరించి విసిని సన్మానించారు. రిజిస్ట్రార్‌తో పాటు విశ్వవిద్యాలయ సిబ్బంది అధ్యాపకులు, అద్యాపకేతరులు పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీసీగా నియమింపబడిన అతి కొద్దికాలంలోనే విశ్వవిద్యాలయ అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ అభివ ృద్ధి పథంలో నడిపిస్తానని, తన మూడు సంవత్సరాల కాలపరిధిలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యాన్ని అందిస్తాన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంతో అత్యాధునికత సంతరించుకొనే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు.
ఈ సందర్భంగా విసి కుటుంబ సమేతంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వహింపజేసి, హారతినిచ్చి శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.