కామారెడ్డి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను భారతీయ జనతా యువమోర్చా నాయకులు ముట్టడిరచారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట మారుస్తుందని, నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నప్పటికి ప్రభుత్వం ఎలాంటి భర్తీ చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళిగా ఉన్న 2 లక్షల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. బిజెవైఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాల విభాగాల సభ్యులు నరేంధర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ 31 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఇక నైనా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం నాయకులు కలెక్టరేట్ లోకి చొచ్చుకొని పోయేందుకు యత్నించడంతో 78 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి దేవున్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.