మోర్తాడ్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం 22 మంది లబ్ధిదారులకు అధికారులు, నాయకులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చొప్పున పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, షబ్బీర్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మోర్తాడ్ జడ్పిటిసి బద్దం రవి, స్థానిక సర్పంచ్ భోగ ధరణి, ఆనంద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.