నిజామాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ, 6వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్టు నిజామాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని, టిఎస్ / ఏపి ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు 7382929612 నెంబర్లో సంప్రదించాలన్నారు.