సమస్యలు గుర్తించి – ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

మోర్తాడ్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి పది రోజులలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలని, జూలై 1 నుండి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని విజయవంతం చేస్తూ మోర్తాడ్‌ మండలాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచేలా చేయాలన్నారు.

కార్యక్రమంలో మోర్తాడ్‌ జడ్పిటిసి బద్దం రవి, కో ఆప్షన్‌ సభ్యుడు ఇంతియాజ్‌, మోర్తాడ్‌ తహసిల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ లు, మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి, ఆనంద్‌, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »