నిజామాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటిస్తూ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అభివృద్ధి పనులు పరిశీలించారు. పమ్మెల్యే వెంట నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. నగర ప్రధాన వీధుల్లో పర్యటించి జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు.
రైల్వే కమాన్ వద్ద అండర్ బ్రిడ్జి పనులను అలాగే నూతన మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా డిఇవో కార్యాలయం వద్ద సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. డిఇవో కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని అధికారులని ఆదేశించారు.

మార్కెట్ నిర్మాణం విశాలంగా ఉండాలని ప్రజలకి వ్యాపారస్తులకు వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అహ్మది బజార్ వద్ద నిర్మాణంలో ఉన్న సమీక ృత మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించారు. రఘునాథ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్లు ఉన్నారు.