హైదరాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారుల వేధింపులతో హైదరాబాద్ రాణిగంజ్ 1వ డిపోకు చెందిన అర్టీసీ డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) పురుగుల మందు తాగి డిపో ముందు ఆత్మ హత్య చేసుకున్నారు.
రెండు రోజులు విధులకు హాజరు కాలేదని ఈ నెల 22వ తేదీ నుంచి డ్యూటీ అప్పగించని అధికారులు మంగళవారం ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డికి ఈ రోజు కూడా డ్యూటీ ఇవ్వక పోవడంతో 6.45 గంటలకు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులు డిపో వద్దకు చేరుకున్నారు.