పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ భిక్నుర్‌ మండల నూతన కార్యవర్గ సమావేశం పట్టణంలోని పద్మశాలి ఫక్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పార్టీని బూత్‌ స్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

అహర్నిశలు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలు బీజేపీ పార్టీకి మాత్రమే సొంతమని అన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్న స్పందించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర నాయకులు నాగర్తి చంద్రారెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చేసే సంస్కరణల వల్ల అన్ని రకాల ప్రజలకు పథకాలు అందుబాటులోకి వచ్చాయని కరోనా కాలంలో కూడా ప్రజలకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »