వేల్పూర్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీరడి భాగ్య, నూతనంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడీ భాగ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గ్రామ వార్డు నుండి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే విధంగా శాయశక్తుల కృషి చేయాలని పేర్కొన్నారు.