నిజామాబాద్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం రోజు రాత్రి సమయంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలి, వారి సిబ్బంది ఏఎస్ఐ రామకృష్ణ నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోని గంగస్థాన్ ఫేస్ 1 లో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు.
ఈ సందర్భంగా రూ. 56 వేల 860 స్వాధీనము చేసుకొని 9 మంది పేకాట ఆడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 9 సెల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, 1 ఫోర్ వీలర్లను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు తెలిపారు.