కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా పక్షాన బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలులో కామారెడ్డి జిల్లా కు చెందిన 31 మంది వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ శోభ వైద్యాధికారులను సన్మానించారు. అధికారుల నెలవారి సమావేశము తర్వాత సన్మాన కార్యక్రమం కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవలు అనిర్వచనీయమని వారిని అభినందిస్తూ ఇకముందు కూడా ఇంకా ఎక్కువ సేవలందించాలని రాజన్న కోరారు.
డాక్టర్ శోభ, సంజీవ రెడ్డికి రాజన్న, నాగరాజు గౌడ్ నిర్వాహకులకు ధన్యవాదములు తెలిపారు. సన్మాన గ్రహీతలందరూ పిహెచ్సి ప్రభుత్వ వైద్యాధికారులు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న, జిల్లా, డివిజన్ అధికారులు డాక్టర్ శోభారాణి, డాక్టర్ శిరీష, డిఐఓ అనిల్ కుమార్, జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన వైద్యాధికారులు పాల్గొన్నారు.