డిచ్‌పల్లి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందరను బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాలలోని విద్యా విధానం, బోధనా వ్యవస్థ, పరీక్షల తీరుతెన్నులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అకడమిక్, స్పోర్ట్స్, ట్రెక్కింగ్, కో -కరిక్యులం కార్యక్రమాలలో రాణిస్తున్న సంగతిని వీసీకి తెలిపారు.
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాలావత్ పూర్ణను గూర్చి ప్రశంసించారు. ఈ సందర్భంగా జూలై 6 నుంచి జరుగనున్న డిగ్రీ పరీక్షలకు విద్యార్థుల సౌలభ్యం కోసం తమ పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయాలని నిజామాబాద్, ఆర్మూర్ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ వీసీని కోరారు. కార్యక్రమంలో రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కె. లావణ్య, డా. ఎ. పద్మారెడ్డి, డా. విరాటి రాధిక, కామర్స్ విభాగాల అధ్యక్షులు ఎం. సరిత, ఆర్. శ్రీవాణి పాల్గొన్నారు.
నిజామాబాద్‌కు చెందిన మంచాల శంకరయ్య ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ వీసీని మర్యాద పూర్వకంగా కలిసి భగవద్గీత ప్రదానం చేశారు. ఉచిత వైకుంఠ రథం, ఉచిత మంచి నీటి సరఫర ట్యాంక్ వంటివి నిర్వహిస్తూ తెలంగాణ జిల్లాల్లో ప్రముఖ ప్రదేశాల్లో కొనసాగిస్తున్న కార్యక్రమాలను గూర్చి తెలిపారు.