కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ మండలం చిన్న తక్కడపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ దేవుబాయి, ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన విషయంలో సర్పంచ్ పదవి నుండి గతంలో తాత్కాలికంగా ఆరు మాసాలపాటు సస్పెండ్ చేయడం జరిగిందని, సస్పెన్షన్ కాలం ముగిసినందున మరొక ఆరు మాసములు సెప్టెంబర్ 22 వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఒక ప్రకటనలో తెలిపారు.