అర్థశాస్త్ర విభాగంలో గంగారాంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి డి. గంగారాం కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేయబడిరది. 100 వ పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు సాధించిన పరిశోధకుడిగా డి. గంగారాం టీయూ చరిత్రలో స్థానం పొందారు.

సహాయ ఆచార్యులు డా.ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధకుడు డి. గంగారాం ‘‘తెలంగాణ రాష్ట్ర పేదలపై సూక్ష్మ రుణాల ప్రభావం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

అందుకు గాను బుధవారం ఉదయం వర్చువల్‌ (ఆన్‌ లైన్‌) వేదికగా ఓపెన్‌ వైవా (బహిరంగ మౌఖిక పరీక్ష) నిర్వహించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం నుంచి సీనియర్‌ ఆచార్యులు డా. డి. పుల్లారావు ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరై పరిశోధకుడిని సిద్ధాంత గ్రంథంపై వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

మద్దునూర్‌ మండలం అంతాపూర్‌ గ్రామంలో ఒక నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి పెరిగిన గంగారాం పేదల ఆర్థిక సమస్యలను తాను రూపొందించుకున్న ప్రశ్నావళి ద్యారా అధ్యయనం చేసి సరిjైున గణాంక పద్దతుల ద్వారా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించడం అభినందనీయమని డా. డి. పుల్లారావు సంతృప్తి వ్యక్తం చేశారు.

సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య కె. శివశంకర్‌ సూక్ష్మ రుణాల వడ్డీ రేట్లతో గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సిద్ధాంత గ్రంథం ప్రభుత్వ విధాన నిర్ణయాలకు దీక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నేటికీ 100 మంది కి పిహెచ్‌.డి. అవార్డులు ప్రదానం కావడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం హర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో నిర్దిష్ట పరిశోధనల అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసి పరిశోధక విద్యార్థి గంగారాంను అభినందించారు. ఇక ముందు కూడా ప్రామాణిక పరిశోధనలు చేయాలని, లాబొరేటరీలను వృద్ధిపరుస్తానని, ప్రత్యేకంగా సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేస్తూ సరిjైున డాటా పొందుపరిచారన్నారు.

విభాగాధిపతి డా.బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, పాఠ్య ప్రణాళిక సంఘ చైర్మన్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు సమన్వయం చేశారు. వైవా కార్యక్రమంలో డా. కె. రవీందర్‌ రెడ్డి, డా. స్వప్న, డా. సంపత్‌, డా. శ్రీనివాస్‌, డా. దత్తహరి తదితర పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »