కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కక్షిదారులు, న్యాయవాదులు, జుడిషియల్ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జూలై 15 వరకు వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కరోనా వేరియంట్లు దృష్ట్యా న్యాయవాదుల అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అత్యవసర కేసులు వర్చువల్ విధానంలో కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర కేసుల్లో వచ్చే వారందరూ కోర్టులలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నిర్ణయం జూలై 15న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని గజ్జల బిక్షపతి తెలిపారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.