Monthly Archives: June 2021

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్ కళాశాలల ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధ‌వారం పెద్దపల్లి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలియజేయడానికి దక్షిణ ప్రాంగణం ముందు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ …

Read More »

వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటి ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి సింగూరు నుంచి ఎత్తిపోతలకు నీటిని …

Read More »

ఎంపిడివోకు స‌న్మానం

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన రామారెడ్డి ఎంపీడీవో విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించిన‌ట్టు రామారెడ్డి మండలాధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, …

Read More »

సురేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ నివాళి

నిజామాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్‌ప‌ల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్‌లో …

Read More »

పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని, తద్వారా అందరికీ ప్రాణవాయువు అందుతుందని కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. కామారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ న్యాయవాదులు ప్రతి సందర్భంలో మొక్కలు …

Read More »

బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం

జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …

Read More »

జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జ‌ర్న‌లిస్టుల ఫోరం, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జ‌ర్న‌లిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు టిజెఎఫ్‌ అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టిడ‌బ్ల్యుజెఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శ బసవ …

Read More »

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం సీఎం పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాలను, విద్యాసంస్థలను కేటాయించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు బాలు, లక్ష్మణ్, సంతోష్ గౌడ్ లను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం గతంలోనే 2018 ఎన్నికల్లో నూతనంగా మెడికల్ కళాశాలను కామారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు …

Read More »

త‌హ‌సీల్ కార్యాల‌యం ముందు పురుగుల మందు తాగిన తండ్రి, కొడుకు

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం కంచర్ల గ్రామానికి ఇద్దరు రైతులు తండ్రి, కొడుకు తహాసిల్దార్ కార్యాలయము వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ‌మ‌నించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో రష్ హాస్పిటల్ కు తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతున్నారు.

Read More »

యువకుని బలవన్మరణం

గాంధారి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్య, ఓ ఎస్ఐ వేదింపులు భరించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానిక ఎస్ఐ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని దెగ్లూర్ కు చెందిన పెద్దోళ్ల శివాజీ (35) గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా 15 సంవత్సరాల క్రితం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »