డిచ్‌పల్లి, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు.
పరీక్షలు మొదటి విడుత ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు కర్షక్, ప్రియదర్శిని, శ్రీ చైతన్య, శ్రీ సద్గురు బండయప్ప స్వామి, సెయింట్ థామస్, ప్రగతి, ఆజాన్ బి.ఎడ్. కాలేజీలలో, రెండవ విడుత ఈ నెల 12 నుంచి 15 వ తేదీ వరకు ఇందూరు, కాటిపల్లి రవీందర్ రెడ్డి, శ్రీ సాయి, యూనివర్సిటి, శ్రీ వేంకటేశ్వర, అహ్మద్, అయేషా, శ్రీ రాఘవేంద్ర బి.ఎడ్. కాలేజీలలో కొనసాగుతాయన్నారు.
కావున బి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవడం, ఆరడుగుల భౌతిక దూరంతో మెలగడం వంటివి పాటించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.