మోర్తాడ్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సాధికారత కృతజ్ఞత సభ నిర్వహించారు. సభకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా అధ్యక్షత వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కొరకై ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా సంఘాల నాయకులు టిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాష్ట్రంలో సీఎం దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సీఎం సాధికారత పథకం దళితులకు ఎంతో అభివృద్ధి చేకూరుస్తుందని ఏలియా అన్నారు. కార్యక్రమంలో మెండోరా జెడ్పిటిసి తలారి గంగాధర్, ఎంపీపీ కమలాకర్, మోర్తాడ్ మండల మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు కల్లెడ చిన్నయ్య, గాండ్ల పేట గ్రామ సర్పంచ్ సౌజన్య, సుమన్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.