మోర్తాడ్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ బోగ ధరణి ఆనందు అధ్యక్షతన పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి పై గ్రామ సభ నిర్వహించారు.
గ్రామ సభలో వచ్చే పది రోజులలో గ్రామంలో జరపాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు చేయాలని హరితహారంలో భాగంగా గ్రామంలోని రోడ్లవెంబడి, ప్రజల ఇంటి ఆవరణలో తప్పనిసరిగా చెట్లు నాటాలని హరితహారం కార్యక్రమానికి సహకరించాలని సర్పంచ్ భోగ ధరని ఆనంద్ కోరారు.
కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, జడ్పిటిసి బద్దం రవి, గ్రామ సచివాలయ కార్యదర్శి రామకృష్ణ, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.