వేల్పూర్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే సందర్భంగా వేల్పూర్ మండలం పడగల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సిబ్బందిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రమేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాత్రి పగలు గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు.
గ్రామంలో వైద్య సిబ్బంది ఒక బాధ్యతగా కరోనా కట్టడిలో గ్రామ ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రాఖీ ప్రభాకర్, భాను, బంధం సురేష్, ప్రసాద్, కొట్టాల మల్లారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.